రాష్ట్రంలో రౌడీయిజం ఉండటానికి వీల్లేదు : సీఎం

SMTV Desk 2018-07-02 13:26:18  ap cm chandrababu naidu, vijayawada, police department, amaravathi,

విజయవాడ, జూలై 2 : రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను, పోలీసులకు వేరుగా చూడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సోమవారం నిర్వహించిన హోంగార్డుల ఆత్మీయ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " కేంద్ర సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో రౌడీయిజం ఉండటానికి వీల్లేదు. హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటున్నారు. ఇది సన్మాన సభ కాదు.. హోంగార్డుల చైతన్య సభ. శాంతి భద్రతలను కాపాడటంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలి. . ఆర్థిక వ్యవస్థ సహకరిస్తే మొట్టమొదట హోంగార్డులనే ఆదుకుంటాం" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.