ఫ్రెంచ్ అధ్యక్షుడి భార్యపై... ట్రంప్..!

SMTV Desk 2017-07-14 14:19:39  tramp, parise, molaniya, brigitti, makran, tour

పారిస్, జూలై 14 : ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ట్రంప్ ఓ యువతిని పొగడ్తల్లో ముంచెత్తించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ ఫస్ట్ లేడీని పొగుడుతూ వచ్చారు. భార్య మోలనియాతో కలిసి ట్రంప్ పారిస్ లోని హోటల్ డెస్ ఇన్ వాలిడెస్ లో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, ఆయన భార్య బ్రిగిట్టీలను కలిశారు. ఈ సందర్భంగా మక్రాన్ తో ట్రంప్ కరచాలనం చేసిన తర్వాత ఆయన భార్యతోను మాట్లాడుతూ "యు ఆర్ ఇన్ సుచ్ ఎ గుడ్ ఫేస్... బ్యూటిఫూల్" అంటూ ఇటు బ్రిగిట్టీతో చెబుతూ మాక్రాన్ వైపుకు చూశారాయన.. ఈ వీడియోను ఫ్రెంచ్ ప్రభుత్వం తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ట్రంప్ ఇచ్చిన ప్రశంసను బ్రిగిట్టీ ఓ చిరు నవ్వుతో స్వీకరించి ఊరుకున్నారు.