పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి తేది పొడిగింపు..

SMTV Desk 2018-07-01 13:13:42  pan-aadhar link, cbdt about pan -aadhar link, aadhar card, income tax

ఢిల్లీ, జూలై 1 : బయోమెట్రిక్‌ ఐడీ-ఆధార్‌తో పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌(పాన్‌) అనుసంధానానికి గడువును కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరోసారి పెంచింది. జూన్‌ 30తో ముగిసిపోయిన గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ఆధార్‌ను పాన్‌తో లింక్‌ చేసుకోవడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు సార్లు తుది గడువు పొడిగించింది. ఆధార్‌ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద దాఖలైన పలు వ్యాజ్యాలు.. పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సీబీడీటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ప్రస్తుతం ఆధార్‌ తప్పనిసరి. టెక్నికల్‌గా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 139ఏఏ(2) ప్రకారం ఆధార్‌తో పాన్‌ను తుది గడువు లోపు అనుసంధానం చేసుకోకపోతే, పాన్‌ కార్డు ఇన్‌వాలిడ్‌ అవుతుంది.