"హ్యాపీ వెడ్డింగ్" కు 1 మిలియన్ వ్యూస్..

SMTV Desk 2018-07-01 11:26:00  niharika, sumanth ashvin,uv creations, happy wedding.

హైదరాబాద్, జులై 1 : మెగా బ్రదర్ నాగబాబు వారసురాలు నిహారిక, సుమంత్ అశ్విన్, జంటగా నటించిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. చక్కటి కుటుంబ భావోద్వేగాలు, సున్నితమైన సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇన్విటేషన్ (టీజర్) ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు (జూన్ 30న) హీరో సుమంత్ అశ్విన్ పుట్టినరోజును పురష్కరించుకుని ‘హ్యాపీ వెడ్డింగ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ ట్రైలర్‌కి 10 లక్షల డిజిటల్ వ్యూస్ వచ్చాయంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ ట్రైలర్‌ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపారు. శక్తికాంత్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. ఒక అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి కుదరడం దగ్గర నుంచి పెళ్లి జరిగేంత వరకు మధ్యలో ఏం జరిగింది, వారి మధ్య చోటుచేసుకున్న సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకనిర్మాతలు వెల్లడించారు.