విజయవాడ చేరుకున్న కేసీఆర్..

SMTV Desk 2018-06-28 12:19:26  ts cm kcr kanaka durga temple visit, telangana cm kcr vijayawada, gannavaram, ap

విజయవాడ, జూన్ 28: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడకను సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి తాను మొక్కిన దేవుళ్లకు వరుసగా మొక్కులు చెల్లించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు దుర్గమ్మను దర్శించుకొనేందుకు గన్నవరం చేరుకున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముక్కుపుడకను తయారుచేయించింది. బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి దీనిని రూపొందించారు. ఈ ముక్కుపుడక 11.29 గ్రాముల బరువు ఉంది. ఉదయం నివేదనలు పూర్తికాగానే తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కనకదుర్గమ్మకు కానుకను అందించనున్నారు. మరో కాసేపటిలో కేసీఆర్ కుటుంబ సమేతంగా దుర్గమ్మ ఆలయంకు వెళ్లనున్నారు.