మ్యూజిక్ వీడియోలో విజయ్ దేవరకొండ..!

SMTV Desk 2018-06-26 15:17:24  vijay devarakonda, music video, bhanusree teja.

హైదరాబాద్, జూన్ 26 : యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగులతో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరో త్వరలో ఓ మ్యూజిక్‌ వీడియోలో సందడి చేయనున్నారు. భానుశ్రీ తేజ దర్శకత్వం వహించబోతున్న ఈ వీడియో సాంగ్ లో విజయ్ దేవరకొండ సరసన బెంగాళీ మోడల్‌ మాళవిక బెనర్జీ నటించనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ వీడియోకు సౌరభ్, దుర్గేష్‌లు సంగీతమందిస్తున్నారు. ఇంతకు ముందు హిందీలో హృతిక్ రోషన్, సోనమ్ కపూర్, ఇమ్రాన్ హష్మీ లాంటి స్టార్లు వీడియో సాంగ్స్ లో నటించారు. ఇలా తెలుగు వీడియో సాంగ్ లో నటించబోతున్న మొదటి హీరో విజయ్ దేవరకొండనే కావడం విశేషం. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ విజయ్ ఇలాంటి మ్యూజిక్ వీడియో చేయడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ టాక్సీవాలా, గీత గోవిందం, నోటా, కామ్రేడ్ సినిమాలలో నటిస్తున్నారు.