మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం.. ఇండియా

SMTV Desk 2018-06-26 13:02:20  Thomson Reuters Foundation, Thomson Reuters Foundation women protect, women issues, delhi

ఢిల్లీ, జూన్ 26 : మన దేశంలో మహిళలకు భద్రత కరువైందని ఓ సర్వే వెల్లడించింది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం భారతదేశమేనని థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్స్‌ సర్వే తెలిపింది. సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 550 మంది నిపుణులను ప్రశ్నించి ఈ జాబితా సిద్ధం చేశారు. లైంగిక హింస, వేధింపులు, మహిళలను లైంగికంగా బలవంత పెట్టడం, అక్రమ రవాణా, లైంగిక బానిసలు, ఇంటి పనులకు బానిసలుగా చేయడం, బలవంతపు వివాహాలు, బ్రూణహత్యలు తదితర విషయాల్లో మహిళలకు ఎక్కడ ఎక్కువ ప్రమాదం ఉందని నిపుణులను ప్రశ్నించి జాబితా తయారు చేసినట్లు రాయిటర్స్‌ వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా మూడో స్థానంలో ఉండగా.. నిత్యం యుద్ధ వాతావరణంతో వణికిపోతున్న అఫ్గానిస్థాన్‌, సిరియాల కంటే కూడా మన దేశంలో మహిళలకు భద్రత కరువైందని సర్వేలో వెల్లడించడం విచారకరమైన విషయం. ఈ సారి వచ్చిన నివేదిక దాదాపు 2011లో వచ్చిన నివేదిక మాదిరిగా ఉందట. అప్పుడు అఫ్గానిస్థాన్‌, కాంగో, పాకిస్థాన్‌, భారత్‌, సోమాలియా దేశాలు మహిళలకు అత్యంత ప్రమాదకరమని . ఈ ఏడాది భారత్‌లో మహిళలకు ప్రమాదం బాగా పెరిగిందని సర్వేలో వెల్లడైంది.