బాలకృష్ణతో జగన్ సినిమా తీయాలనుకున్నారా, అక్కడే ఆగిపోయిందా...

SMTV Desk 2017-07-14 11:41:38  amaravathi ,ysrcp, tdp ,balakrishna, ys jagan , movie ,

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో హిందుపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సినిమా తీయాలని భావించారా? అంటే అవుననే అంటున్నారు. వైయస్ జగన్ ఒకప్పుడు బాలకృష్ణకు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. బాలకృష్ణ అభిమాన సంఘానికి జగన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. బాలకృష్ణపై ఉన్న అభిమానంతో అతనితో ఓ సినిమా నిర్మించాలని జగన్ భావించారని తెలుస్తోంది. అప్పటికే సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు వంటి హిట్ సినిమాలతో బాలకృష్ణ దూసుకెళ్తున్నారు. అలాంటి సమయంలో బాలయ్య హీరోగా ఓ సినిమా తీయాలని భావించారు. అలాంటి సినిమా తీయాలని.. 2003లో నిర్మాతగా మారి బాలకృష్ణతో ఓ యాక్షన్ త్రిల్లర్ సినిమా తీయాలని జగన్ ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు. ఈ విషయం బాలయ్య వరకు వెళ్లిందో లేదో తెలియదు. అక్కడే ఆగిపోయింది అయితే, కానీ ఓ చిక్కు వచ్చి ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. అప్పటికే వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబుల మధ్య రాజకీయంగా విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. జగన్ కోరిక నెరవేరలేదు దీంతో జగన్ ప్రాజెక్టు వర్కవుట్ కాలేదని చెబుతున్నారు. తన అభిమాన నటుడితో మంచి యాక్షన్ థ్రిల్లర్ తీయాలని జగన్ అనుకున్నప్పటికీ కుదరలేదని అంటున్నారు. ఇదీ జగన్ జగన్‌కు సినీ నటుడిగా బాలకృష్ణను ఎప్పటికీ ఇష్టపడతారు. రాజకీయపరంగా మాత్రం ఇద్దరివి వేర్వేలు దారులు. చంద్రబాబు, ఇతర టిడిపి నేతలపై తీవ్ర విమర్శలు చేసే జగన్ బాలకృష్ణపై మాత్రం విమర్శలు చేసిన సందర్భాలు పెద్దగా లేవని అంటున్నారు