మంగళగిరిలో పర్యటించిన జనసేనాని..

SMTV Desk 2018-06-24 15:25:03  pawan kalyan, janasena chief, mangalagiri, janasena chief

విజయవాడ, జూన్ 24 : నగరానికి మకాం మార్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఆయన ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో పర్యటించారు. చినకాకాని వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలాలను పరిశీలించారు. అనంతరం కాజ వద్ద ఉన్న రామకృష్ణ వెనుజియా ప్రాంగణంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలను స్థల యజమానులతో కలిసి పరిశీలించారు. అదే ప్రాంతంలో పార్టీ సన్నిహితులు, కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన కొద్దిమంది నేతలతో సమావేశమయ్యారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు, అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. కాజలోని నిర్మిస్తున్న తన నివాసం, పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పవన్‌ పరిశీలించారు.