ఫిఫా : భారత్ నుండి మరో ప్రాతినిధ్యం..

SMTV Desk 2018-06-23 12:29:55   Nathania John K , #fifa ombc, tamilnadu ball carrier, russia

మాస్కో, జూన్ 23 : రష్యా వేదికగా జరుగుతున్నా ఫిఫా ప్రపంచకప్‌లో ఇండియా నుండి మరో ప్రాతినిధ్యం అందింది. టోర్నీలో భాగంగా శుక్రవారం బ్రెజిల్‌-కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌లో అధికారిక బంతిని మైదానంలోకి నతనియా తీసుకువచ్చింది. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి బ్రెజిల్, కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌‌‌కి నతానియా బ్రెజిల్ జట్టు బాల్ క్యారియర్‌గా ఆటగాళ్లతో కలిసి మైదానంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల నతానియా.. భారత్ తరఫున ఫిఫా ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహించిన తొలి అఫిషియల్ మ్యాచ్ బాల్ క్యారియర్‌ (ఓఎమ్‌బిసి)గా రికార్డు నెలకొల్పింది. కర్ణాటకకి చెందిన పదేళ్ల బాలుడు రిషితేజ్ ఇటీవల బాల్ క్యారియర్‌గా గౌరవం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఫిఫా ప్రపంచకప్‌కి ముందు ఫిఫా స్పాన్సర్ కియా ఓ కాంటెస్ట్‌ని నిర్వహించింది. ఇందులో పోటీపడిన రిషితేజ్, నతానియా ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు.