ప్రేమలో పడితే నీరు కూడా షర్‌బతే..

SMTV Desk 2018-06-22 16:08:40  ranbeer kapoor, aliya bhat, ranbeer about marriage

ముంబై, జూన్ 22 : బాలీవుడ్‌ జంటలు రణ్‌బీర్‌-ఆలియా గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. కానీ ఈ విషయంపై వీరిద్దరిలో ఏ ఒక్కరూ నోరు విప్పడంలేదు. కాని త్వ‌ర‌లోనే రణ్‌బీర్‌-ఆలియా పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే తన గురించి, ఆలియా గురించి వస్తోన్న వదంతులపై నేపథ్యంలో రణ్‌బీర్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. "ప్రేమలో పడటం అనేది గొప్ప ఫీలింగ్‌. ప్రేమలో పడితే నీరు కూడా షర్‌బత్‌ అంత రుచిగా ఉంటుంది. పాత విష‌యాలు నాకు పెద్ద‌గా గుర్తుండ‌వు. వ్య‌క్తిగ‌తంగానే వృత్తిప‌రంగా కూడా నేను చాలా విష‌యాలు మ‌ర్చిపోతుంటాను. అయినా ప్రేమలో పడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? నేను ఆలియా గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవడంలేదు. ఎందుకంటే ఏదన్నా మాట్లాడితే మీడియా తప్పుగా రాసేస్తుంది. అవి చ‌దువుతుంటే భ‌య‌మేస్తోంది. అయితే, ఆలియా న‌ట‌న‌, జీవితం నాకెంతో స్ఫూర్తినిస్తాయి. నేను బంధాలకు ఎంతో విలువిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.