మెస్సికి మరుపురాని కానుక..

SMTV Desk 2018-06-22 13:45:35  lionel messi birth day, lionel messi birth day gift, fifa foot ball, messi

మాస్కో, జూన్ 22 : అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సికి పుట్టిన రోజు మరుపురాని కానుక అందింది. రష్యా వేదికగా ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తన ఆటతీరుతో యావత్తు ప్రపంచంలో మెస్సి పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ ఆదివారం (జూన్‌ 24) నాడు మెస్సి తన 31వ పుట్టిన రోజును జరుపుకొనున్నాడు. ఈ సందర్భంగా బ్రానిట్సీ వాసులు మెస్సికి ఫిపా ప్రపంచకప్‌ నమూనాను తయారు చేసి పుట్టిన రోజు కానుకగా ఇచ్చారు. అంతేకాదు ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కూడా పంపించారు. స్థానిక అభిమానుల నుంచి అందుకున్న ఈ కానుకలు చూసి మెస్సి ఆనందం వ్యక్తం చేశాడు. వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. టోర్నీలో భాగంగా గురువారం రాత్రి క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 0-3తో ఓటమి పాలైంది. దీంతో తుది-16లో స్థానంపై అనుమానం నెలకొంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన అర్జెంటీనా కేవలం ఒక్క పాయింట్‌తో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.