12 లక్షల చెట్టు !

SMTV Desk 2017-07-13 16:21:14  BHOPAAL, TREES, SRILANKAMINISTER, HOME GUARD, WATER TANK

భోపాల్‌, జూలై 13 : మధ్యప్రదేశ్‌లోని సల్మత్‌పూర్‌ ప్రాంతంలో ఒక రావి చెట్టును సంరక్షించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.12 లక్షలు ఖర్చు అవుతోందట. ఇది భారత్ లోనే తొలి వీవీఐపీ చెట్టు. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే ఈ రావి చెట్టును ఐదేళ్ల క్రితం అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సా నాటారట. దీని సంరక్షణకు ప్రత్యేక వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పురుగులు పట్టకుండా, వాడిపోకుండా ఉండడానికి మధ్యప్రదేశ్‌లోని అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన బొటానిస్ట్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఈ చెట్టు చుట్టూ కంచె వేసి 24 గంటలూ కాపలా ఉండేలా ఇద్దరు గార్డులను నియమించారు. ఇంతకు ముందు ఈ చెట్టుని చూడడానికి చాలా మంది వచ్చారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిపోయిందని పరమేశ్వర్ తివారీ అనే హోం గార్డ్ తెలిపారు. అయితే ఈ చెట్టుకి పెట్టే ఖర్చులో సగం ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు వెచ్చించి ఉంటే బాగుండేది అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.