స్కూళ్లకు సెలవులు పొడిగించిన ఏపీ ప్రభుత్వం..

SMTV Desk 2018-06-21 15:34:12  ap holidays, amaravathi, ganta srinivasa rao, ap schools days

అమరావతి, జూన్ 21 : రాష్ట్రంలో భానుడు సెగ తగ్గుముఖం పట్టకపోవడంతో సెలవుల్ని మరో రెండు రోజులు పెంచుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మంగళవారం నుంచి నేటి వరకు సెలవులు ఇస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ సెలవుల్ని శనివారం వరకు పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు సైతం విద్యార్థులకు సెలవులు ఇవ్వాల్సిందేనని, తరగతులు నిర్వహిస్తే వాటి గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. సోమవారం నుంచి పాఠశాలలు యథావిథిగా నడుస్తాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.