నిధుల దుర్వినియోగంపై కొనసాగుతున్న విచారణ

SMTV Desk 2017-07-13 15:44:43  KHAMMAM, DCCB BANK, MANAGER, CLERK, CASHIER, LAKHS

ఖమ్మం, జూలై 13 : ఖమ్మం జిల్లా వైరా డీసీసీబీలో నిధుల దుర్వినియోగం కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ నిధుల స్వాహాపై ముగ్గురు సభ్యుల బృందం విచారణ చేపట్టారు. రైతులకు చెందిన రూ. 37 లక్షలు స్వాహా చేసినట్లు అధికారులు నిర్ధారించారు. కాగా తన ఖాతాలో రూ. 2.5 లక్షలు లేకపోవటంపై ఖాతాదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 4న రైతు ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించినట్లు విచారణ అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్, క్యాషియర్‌ను సస్పెండ్ చేశారు.