విఘ్నేశ్ దర్శకుడు.. నయన్ నిర్మాత..

SMTV Desk 2018-06-20 14:12:52  nayanatara, vignesh shivan, nayan as a producer.

హైదరాబాద్, జూన్ 20 : టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ భాషతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది హీరోయిన్ నయనతార. కథానాయిక పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచింది. అయితే నేటికి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ఈ అమ్మడు. ఈ భామ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో వున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన భర్త అంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా నయన్.. ఇప్పుడు నిర్మాతగా మారిందనేది సమాచారం. దర్శకుడు విఘ్నేశ్ శివన్.. నయన్ కోసం ఒక లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసి నయనతారకి వినిపించాడట. ఈ సినిమాలో కథానాయికగా నటించడానికి.. తానే నిర్మించడానికి నయనతార అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ ఇద్దరు విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విఘ్నేశ్ పైన ప్రేమతోనే నయన్ ఈ సినిమాను నిర్మించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.