నిలువుగా కోసిన చావలేదు

SMTV Desk 2017-07-13 14:53:18  FISH, JAPAAN, DOCTORS, VIDEO, SOCIAL MEDIA

జపాన్, జూలై 13 : చేపల కూర అంటే లొట్టలేసుకుంటూ తింటారు చాలామంది. డాక్టర్లు కూడా చేపలు తినండి ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అన్ని సుగుణాలున్న చేపల కూర తినాలంటే ముందు దాన్ని చంపి ముక్కలు ముక్కలుగా కోసి మంచిగా కడిగి కూర వండాల్సిందే! జపాన్ లో ఇలాగే ఆహారం కోసం ఓ చేపను కోసినా.. ఆ చేప ఎగురుతూ వెంటనే చనిపోకుండా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎల్లో ఫిన్ టూన్ అనే చేపను బతికుండగానే నిలువుగా కోశారట.. అయిన ఆ చేప చనిపోకుండ కాసేపు అలాగే ఎగిరిందట. చేప కొట్టుకుంటున్నప్పుడు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అలాగే ఓ రెండు నిమిషాల పాటు కొట్టుకొని చివరికి ప్రాణాలు విడిచిందట ఆ చేప.