రేపు విశాఖ పర్యటనకు వెళ్లనున్న సీఎం..

SMTV Desk 2018-06-20 13:27:05  apcm visit vishakapatnam, au vishakapatnam, amaravathi

అమరావతి, జూన్ 20 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు విశాఖలో పర్యటించనున్నారు. నగరంలో ఏడు గంటల పాటు ఆయన పర్యటన జరగనుంది. ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకొని.. నేరుగా రుషికొండలోని సాయిప్రియా రిసార్ట్స్ చేరుకుని వుడా అభివృద్ది చేసిన అమృత వ్యాలీని ప్రారంభిస్తారు. 12 గంటలకు అక్కడే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఉత్సవ్‌ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు సాయిప్రియా రిసార్ట్స్ నుంచి బయలు దేరి పోర్టు అతిధి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. నగరంలో తొమ్మిది వేల మందికి నివాస స్ధలాలను రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో గాజువాకకు చెందిన ఐదు వేల మందికి నివాసాలను క్రమబద్దీకరించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహణ ఉంటుంది. సాయంత్రం 5.25 గంటలకు తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ తిరుగు కానున్నారు.