మెక్సికో కిక్..

SMTV Desk 2018-06-18 11:00:58  #fifa world cup, fifa world cup-2018, germany vs mexico, russia

మాస్కో, జూన్ 18 : ఫిఫా ప్రపంచకప్‌ లో సంచలనం నమోదైంది. ఫుట్‌బాల్‌ ప్రపంచ మాజీ ఛాంపియన్ జర్మనీ కు మెక్సికో షాక్ ఇచ్చింది. ఆదివారం 78 వేల ప్రేక్షక సందోహం మధ్య ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన గ్రూప్‌ ‘ఎఫ్‌’ మ్యాచ్‌లో మెక్సికో 1–0తో జర్మనీని బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. ఆట 35వ నిమిషంలో మెక్సికో ఆటగాడు లొజనో గోల్‌ సాధించాడు. అనంతరం జర్మనీ తీవ్రంగా కృషిచేసినా గోల్‌ సాధించకలేకపోయింది. ఆట మొత్తంలో జర్మనీ ఆధిపత్యం ప్రదర్శించినా గోల్‌ సాధనలో విఫలం కావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో సెర్బియా జట్టు 1-0 తేడాతో కోస్టారికాపై విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ఆచితూచి ఆడిన ఇరు జట్లు ప్రథమార్థంలో ఒక్క గోల్‌ నమోదు చేయలేకపోయాయి. ఫ్రీకిక్‌ రూపంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సెర్బియా కెప్టెన్‌ అలెగ్జాండర్‌ జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. దీంతో సెర్బియా 1-0తో ఆధీనంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్‌లో మరొక గోల్‌ నమోదు కాకపోవడంతో సెర్బియా విజయం సాధించింది.