సౌత్ ఫిల్మ్ ఫేర్ -2018.. అవార్డ్స్..

SMTV Desk 2018-06-17 11:27:45  south filmfare 2018 awards, hyderaabad, bahubali movie.

హైదరాబాద్, జూన్ 17 : 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం నిన్న రాత్రి హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో వైభవంగా జరిగింది. తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగులో బాహుబ‌లి-2 చిత్రం ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం 8 విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. అలాగే అర్జున్‌ రెడ్డి చిత్రానికిగానూ ఉత్త‌మ నటుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ, ఉత్త‌మ న‌టిగా సాయి ప‌ల్ల‌వి, క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటిగా రితికా సింగ్‌(గురు చిత్రానికి), దర్శకధీరుడు రాజ‌మౌళికి బాహుబ‌లి-2కి ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. >> అన్ని భాషలలో అవార్డు విజేతల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. >> టాలీవుడ్.. * ఉత్తమ చిత్రం - బాహుబలి 2 * ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2) * ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) * ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా) * ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా) * ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు) * ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2) * ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2) * ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2) * ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే * ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్) * జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ * ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్) * ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్) * ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2) * ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2) >> తమిళం (కోలీవుడ్‌) * ఉత్తమ చిత్రం - అరమ్ * ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద) * ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద) * ఉత్తమ నటి - నయనతార (అరమ్) * ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు) * ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి) * ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ) * ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్ * ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న * ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్ * ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి * ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్) * ఉత్తమ తొలి నటుడు - వసంత్ రవి (తారామణి) >> కన్నడ(శాండల్‌వుడ్‌) * ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె * ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక) * ఉత్తమ నటుడు - రాజ్ కుమార * ఉత్తమ నటి - శ్రుతి హరిహరన్ * ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ * ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్ * ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక) * ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్ * ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్ * ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్ * ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్ * ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్ >> మాలీవుడ్‌(మళయాళం) * ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ * ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్ * ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్ * ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్) * ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్ * ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్ * ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ * ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్ * ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు) * ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్ * ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర * ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది) * ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్) * ఉత్తమ తొలిచిత్ర నటి - ఐశ్వర్య లక్ష్మి