‘మేకింగ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌’ పుస్తకావిష్కరణ

SMTV Desk 2017-07-13 11:55:08  DELHI, MODI, AMITH SHAA, MAKING OF A LEGEND,

దిల్లీ, జూలై 13 : హిందుత్వ సంస్థ- రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)లో కేవలం ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూనే దానిలో ఎలాంటి ప్రముఖ పాత్ర పోషించకపోవడం (‘అప్రసిద్ధ్‌’గా ఉండడం) వల్లనే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఉజ్వల ప్రస్థానాన్ని కొనసాగించగలిగారని ఆ సంస్థ అధిపతి మోహన్‌ భగవత్‌ చెప్పారు. మోదీ గురించి ప్రస్తావిస్తూ సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ రచించిన ‘మేకింగ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌’ పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. అనంతరం భగవత్‌ ప్రసంగిస్తూ, ‘మోదీ ఒకవేళ ఆరెస్సెస్‌లోనే కొనసాగి ఉంటే సంస్థ వెలుపల కొద్దిమందికే ఆయన తెలిసి ఉండేవారు. అణకువ, మర్యాద ఉన్న లక్షణాలే ఆయన్ని ముఖ్యమంత్రిని , ప్రధానమంత్రిని చేశాయి. నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న విమర్శలను అమిత్‌షా తిప్పికొట్టారు. ‘నిరుద్యోగ వృద్ధి గురించి ఆర్థికవేత్తలు మాట్లడుతున్నారని అన్నారు. ఉద్యోగాలెక్కడని అడుగుతూనే నా తలమీదున్న కాస్త వెంట్రుకలనూ పీకేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేవలం ఉద్యోగ సృష్టితో సమస్య తీరిపోదు ని, ‘ముద్రా’ పథకం ద్వారా మూడేళ్లలో 7.28 కోట్ల మంది స్వయం ఉపాధి పొందారని ఆయన వెల్లడించారు.