రోహిత్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం..

SMTV Desk 2018-06-16 19:03:56  NARA ROHIT, PRODUCER KOTI TOOMULA.

హైదరాబాద్, జూన్ 16 : యువ కథానాయకుడు నారా రోహిత్.. కార్తికేయ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. కృతిక, నీలమ్‌ ఉపాధ్యాయ కథానాయికలుగా కనిపించనున్నారు. శ్రీ శంఖ చక్ర ఫిల్మ్స్‌ పతాకంపై కోటి తూముల నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ.. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. టర్కీలో రెండు పాటలు షూట్‌ చేశాం. ప్రస్తుతం పతాక సన్నివేశాల్ని చిత్రీకరించాం. కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా దర్శకుడు కార్తికేయ చెప్పిన దానికంటే సినిమాను చాలా బాగా చిత్రీకరించారు. ఇది నారా రోహిత్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.