నా బలం, బలహీనత రెండు నువ్వే..

SMTV Desk 2018-06-16 18:19:49  PRIYANKA CHOPRA, NIK JONAS, PRIYANKA MOTHER.

హైదరాబాద్, జూన్ 16 : బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంకా చోప్రా.. తన తల్లి మధు చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో పాటు "అందమైన మహిళకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నా బలం, బలహీనత రెండూ ఒక్కరే. నీ ఆశలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. నీతో కలిసి వేడుక చేసుకునేందుకు వేచి చూస్తున్నాను అమ్మా" అంటూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. త్వరలోనే ప్రియాంక పెళ్లిపీటలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ప్రియాంక.. హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ప్రేమలో మునిగినట్లు తెలుస్తోంది. ఇటీవల నిక్ జోనాస్ ఫ్యామిలీ కి చెందిన ఒక ప్రైవేట్ వేడుకకు ప్రియాంక చోప్రా ప్రత్యేక అతిధిగా రావడమే కాక ఇద్దరూ చేతులు జోడించి కొత్త జంటలా పెళ్లికి హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారన్న వార్త వినిపిస్తోంది. ఈ మేరకు వీరిద్దరి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందించి౦ది. ప్రియాంకపై వస్తున్న వార్తల్లో ఏనాటి నిజం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ నిక్‌తో ప్రియాంక పెళ్లికి సిద్ధపడితే అందుకు తాను ఒప్పుకోనని చెప్పారు. విదేశీయుడిని ప్రియాంక పెళ్లి చేసుకుంటే తాను భరించలేనన్నారు. ప్రియాంక జీవితాంతం పెళ్లి చేసుకోకపోయినా ఓకె కానీ, ఒక విదేశీయుడిని చేసుకోవడానికి మాత్రం అంగీకరించనని పేర్కొన్నారు. అయితే తన తల్లి మాటలపై నిక్‌తో ప్రేమ వ్యవహారంపై గానీ, తల్లి అభిప్రాయంపై గానీ ప్రియాంక ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.