పావుగంట డాన్స్ కు పాతిక లక్షలా..?

SMTV Desk 2018-06-16 16:28:07  RAKUL PREETH SINGH, STAGE PERFORMENCE, FILIMFARE AWARDS.

హైదరాబాద్, జూన్ 16 : ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్స్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తుంటారు. సెలబ్రిటీలు.. టాప్ హీరోయిన్ల ఆటాపాటలతో ఈ ఫంక్షన్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఇలాంటి కార్యక్రమాలలో టాప్ హీరోయిన్స్ తో డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. ఇందుకుగాను వారికి భారీ మొత్తాన్నే ఇస్తారట. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లో జరగనున్న ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ ఫంక్షన్ లో సౌత్ లోని నాలుగు భాషల నుంచి హీరోలు.. హీరోయిన్లు.. టెక్నీషియన్లు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈసారి స్టేజిపై టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సందడి చేయనుంది. మొత్తం 15 నిమిషాలపాటు రకుల్ పెర్ఫార్మెన్స్ ఉంటుందట. ఇందుకోసం ఆమెకు భారీ మొత్తమే ముట్టజెప్పినట్లు సమాచారం. రకుల్ ఒక పావుగంట ఆడిపాడినందుకు దాదాపు రూ. 25 లక్షల వరకు ఆమెకు చెల్లిస్తున్నారట. దాదాపుగా ఓ స్టార్ హీరోయిన్ రెమ్యునరేషన్ తో ఇది సమానం. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు లేక ఈ అమ్మడు కాస్తంత డల్ అయిపోయినా.. హిందీ, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.