రేణూకు జోడీ కుదిరిందా..!!

SMTV Desk 2018-06-16 16:11:59  RENU DESAI, INSTAGRAM POST, RENU DESAI NEW POST.

హైదరాబాద్, జూన్ 16 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. ఆయన నుండి విడిపోయాక సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులోనే ఉంటున్నారు. తన కుటుంబ విషయాలను.. తన కుమారుడు, కూతురికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే పవన్ నుండి ఈమె విడిపోయాక రేణూ ఒక తోడు కోరుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించడంతో ఆమెపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. వారందరికీ రేణూ ఘాటుగా సమాధానం ఇస్తూ.. మహిళలు మళ్లీ పెళ్లి చేసుకోకూడదా? అని ప్రశ్నించారు. అయితే తాజాగా ఈమెకు సరైన వ్యక్తి భాగస్వామిగా దొరికినట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్. ఇంతకి ఆ పోస్ట్ లో ఏముందంటే.. ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను రేణూ పంచుకున్నారు. అంతేకాకుండా ఈ ఫోటోతో పాటు "నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా. ఈ ప్రయాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతిని మర్చిపోయాను. నీలో నా ప్రేమ దొరికింది. నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు" అంటూ పోస్ట్ చేశారు. రేణు పోస్ట్‌కు నెటిజన్ల నుంచి సానుకూల కామెంట్లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. చక్కగా ఉన్నారు. చివరికి మీ ప్రేమ దొరికింది. సంతోషంగా ఉండండి, శుభాకాంక్షలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.