ఆ కంపెనీలపై కేంద్రం ప్రభుత్వం కొరడా ..

SMTV Desk 2018-06-16 14:12:24  ministry of corporate affairs (MCA), 25-30 per cent Indian companies, central government, delhi

ఢిల్లీ, జూన్ 16 : గత రెండేళ్లుగా ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు సాగించకపోవడంతో దేశవ్యాప్తంగా 25 నుంచి 30 శాతం కంపెనీలు త్వరలో మూసివేయించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తోంది. ఆ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని చూస్తోంది. డొల్ల కంపెనీలు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కంపెనీల చట్టంలోని కొన్ని నిబంధనలను ఉపయోగించి.. గత రెండేళ్లుగా క్రీయాశీలకంగా లేని కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఒక కంపెనీ రెండేళ్లుగా ఎలాంటి వ్యాపార కార్యక్రమాలు చేయకుండా, ఎలాంటి ఆదాయం పొందకుండా ఉంటే ఆ కంపెనీలను డీరిజిస్టర్‌ చేసే వెసులుబాటు చట్టంలో ఉంది. దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అలాంటి కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. వాటికి 30రోజుల్లోగా కంపెనీలు స్పందించాల్సి ఉంటుంది. ఇటీవల డొల్ల కంపెనీలను గుర్తించే క్రమంలో కొన్ని కంపెనీలు గత రెండేళ్లుగా క్రీయాశీలకంగా లేవని అధికారులు గుర్తించినట్లు సమాచారం.