ఫిఫా వరల్డ్ కప్ : రోనాల్డ్ ఆదరగోట్టేశాడు..

SMTV Desk 2018-06-16 11:51:18  cristiano ronaldo, #fifa 2018, fifa world cup, russia

సోచి, జూన్ 16 : సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన అద్భుత ఆటతో అదరగొట్టేశాడు. అర్ధరాత్రి స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తప్పదనుకున్న పోర్చుగల్ జట్టుకి 88వ నిమిషంలో రొనాల్డో గోల్ చేసి మ్యాచ్‌ని డ్రాగా ముగించాడు. హురాహోరీగా సాగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్పెయిన్, పోర్చుగల్ జట్లు ఆది నుంచి నువ్వా-నేనా అన్నట్లు పోరాడాయి. హ్యాట్రిక్‌తో దుమ్మరేపిన రోనాల్డో .. ఓ రకంగా స్పెయిన్ విజయాన్ని అడ్డుకున్నాడు. రొనాల్డో మ్యాచ్‌ ఆరంభమైన 4వ నిమిషంలోనే పెనాల్టీని గోల్‌ చేసి పోర్చుగల్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత స్పెయిన్‌ ఆటగాడు డిగో కోస్టా 24వ నిమిషంలో గోల్‌ చేసి మ్యాచ్‌ను సమం చేశాడు. ఈ క్రమంలో రొనాల్డో మరింత దూకుడు ప్రదర్శించి 44వ నిమిషంలో మరో గోల్‌ అందించి మ్యాచ్‌ను 2-1 ఆధిక్యంలో తీసుకెళ్లాడు. కాగా 55వ నిమిషంలో స్పెయిన్‌ ఆటగాడు డిగో కోస్టా మరోసారి గోల్‌తో మెరిపించగా, మరో ఆటగాడు నాచో కూడా 58వ నిమిషంలో గోల్‌ అందించి స్పెయిన్‌ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. దీంతో పోర్చుగల్‌ 2-3తో వెనుకబడినట్లయింది. ఈ దశలో రొనాల్డో 88వ నిమిషయంలో లభించిన ఫ్రీకిక్‌ను అద్భుత రీతిలో గోల్‌గా మలిచి మ్యాచ్‌ను సమం చేశాడు. ఆ తర్వాత మ్యాచ్‌ సమయం కూడా పూర్తి కావడంతో పోర్చుగల్‌ 3-3తో స్పెయిన్‌తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మరో వైపు ఉరుగ్వే 1-0తో ఈజిప్ట్‌పై విజయం సాధించగా.. ఇరాన్, మొరాకో మధ్య మ్యాచ్ లో.. మొరాకో ఆటగాడు అజీజ్‌ బొహాదూజ్‌ చేసిన సెల్ఫ్ గోల్ తప్పిదంతో ఇరాన్ జట్టు అనూహ్యంగా గెలుపొందింది.