బుల్లి ఎన్టీఆర్ ఫోటో చూశారా..!!

SMTV Desk 2018-06-15 17:45:54  junior ntr, ntr second son, photos viral.

హైదరాబాద్, జూన్ 15 : యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ రెండోసారి తండ్రైన విషయం తెలిసిందే. తారక్‌, ప్రణతీ దంపతులకు నిన్న పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని తారక్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. "నా కుటుంబం మరింత పెద్దదైంది. మళ్లీ బాబు పుట్టాడు" అని పేర్కొన్నారు. ఇప్పటికే తారక్‌ దంపతులకు తొలి సంతానంగా అభయ్‌ ఉండగా.. మరి ఇప్పుడు కొత్తగా చేరిన జూనియర్‌ తారక్‌కి ఏ పేరు పెట్టబోతున్నారో..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ రెండో కుమారుడి ఫొటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఎన్టీఆర్ కుమారుడు ఎంతో ముద్దుగా ఉన్నాడంటూ ప్రతి ఒక్కరు ఈ ఫొటోకు కామెంట్ పెడుతున్నారు. ఆ చిన్నారి ఫోటో ఒకసారి లుక్కేయండి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్‌ డ్రాప్‌ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.