అరంగేట్రంలోనే రషీద్ ఖాన్ చెత్త రికార్డు..

SMTV Desk 2018-06-15 13:52:19  rashid khan, afghanistan rashid khan, shikhar dhawan, k.l rahul

బెంగుళూర్, జూన్ 15 : అప్ఘానిస్థాన్ జట్టు బెంగుళూరు వేదికగా జరుగుతున్నా మ్యాచ్‌లో అఫ్గాన్‌ బౌలర్ రషీద్ ఖాన్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ శతకాలు సాధించగా.. లోకేష్ రాహుల్ (54).. రెండో రోజు హార్దిక్ పాండ్య (94 బంతుల్లో 71), ఉమేష్ యాదవ్ (21 బంతుల్లో 26 నాటౌట్) వేగంగా ఆడారు. భారత బ్యాట్స్‌మెన్ దూకుడు ధాటికి టీ20ల్లో నంబర్.1 బౌలర్ అయిన రషీద్ లాంగ్ ఫార్మాట్లో తేలిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లు వేసిన ఈ అప్ఘాన్ స్పిన్నర్ 154 పరుగులిచ్చి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. జట్టు టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా రషీద్ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో ఈ రికార్డ్ పాక్ బౌలర్ అమీర్ ఇలాహీ పేరిట ఉండేది. పాకిస్థాన్ 1952లో భారత్‌పై టెస్టుల్లోకి అరంగేట్రం చేసింది. ఆ మ్యాచ్‌లో అమీర్ 134 పరుగులు ఇవ్వగా.. రషీద్.. అంత కంటే ఎక్కువ పరుగులిచ్చాడు.