గోవుకు ఊపిరి పోసిన ముస్లిం

SMTV Desk 2017-07-12 18:41:26  cow, muslim, utharapradhesh, lakno, police

లక్నో, జూలై 12 : మన భారతదేశం ఎంతో పవిత్రంగా పూజించే గోవును కొందరు దుర్మార్గులు మాంసానికి ఉపయోగిస్తున్నారు. గో మాంసం కోసం ఆవులను కభేళాలకు తరలిసున్నారనే అనుమానాలపై అమాయకులను కొట్టి చంపుతున్న నేటి సమాజంలో ఆపదలో చిక్కుకున్న ఓ ఆవును ముస్లింలు రక్షించడం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా, బిలారి గ్రామంలో జరిగిన ఈ సంఘటన కు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో హాల్ చల్ చేస్తుంది. బిలారి గ్రామంలోని ఓ స్మశానంలోకి రెండు రోజుల క్రితం ప్రవేశించిన ఓ అవును ప్రమాదవశాత్తు అందులో ఉన్న ఓ గుంతలో పడిపోయింది. ఆ గోవు అవస్థను గమనించిన ముస్లిం యువకులు తమ పెద్దలకు చెప్పడంతోనే వారు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. అందరూ కలిసి తాళ్లు సహాయంతో ఆ గోవును వెలుపలికి తీశారు. దీనిపై గ్రామస్థులందరూ కూడా వారి మానవత్వానికి ప్రశంసిస్తూ హర్షం వ్యక్త పరిచారు.