మహేష్ ముంబై ఎందుకు వెళ్ళాడో తెలుసా..!!

SMTV Desk 2018-06-14 18:26:03  mahesh babu, stylist, hakim aalim stylist.

హైదరాబాద్, జూన్ 14 : సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ సినిమా కోసం కొత్త గెటప్ లో దర్శనమివ్వనున్నాడు. ఇప్పటి వరకు ఒకటే లుక్ లో కనిపించిన ప్రిన్స్ కాస్త ట్రెండ్ మార్చి అభిమానులకు కనువిందు చేయనున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మహేష్ ముంబై వెళ్లిరావడంతో.. ఆయన బాలీవుడ్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకు ఆయన ముంబై ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహేశ్ బాబు ముంబై వెళ్లి వచ్చింది.. హకీమ్ ఆలిమ్ కోసమట. ముంబైలో సెలబ్రిటీ స్టయిలిస్ట్ హకీమ్ ఆలిమ్ గైడెన్స్ తీసుకుంటున్నాడు. హకీమ్ ఆలిమ్ బాలీవుడ్ లో ఎందరో పెద్ద హీరోలకు స్టయిలిస్ట్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న లుక్ పట్ల కూడా మహేష్ సంతృప్తిగా లేడని తెలుస్తోంది. తన లుక్ ను కొత్తగా కనిపించేందుకు కసరత్తు చేస్తున్నాడు. ఇక షూటింగ్ ప్రారంభించాక హకీమ్ కూడా హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.