ఫిట్‌నెస్‌ కోసం వాటికీ దూరమయ్యా..

SMTV Desk 2018-06-13 13:55:22  dhoni fitness, msd fitness, indian cricket player dhoni, ipl

ముంబై, జూన్ 13 : ఫిట్‌నెస్‌ క్రీడాకారులకు చాలా ముఖ్యం. ప్రస్తుత టీమిండియా క్రికెట్‌లో ఫిట్‌నెస్‌ పాత్ర విస్మరించాలేనిది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోహ్లి.. తర్వాత ధోనినే. 36 ఏళ్ల వయస్సులోనూ ధోనీ ఎంతో ఫిట్‌గా కనిపిస్తాడు. అంతేకాదు జట్టులోని యువ ఆటగాళ్లతో పరుగులు తీసేందుకు పోటీపడతాడు. తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించాడు. ఇటీవల వెస్టిండీస్‌ ఆటగాడు బ్రావోతో కలిసి త్రీ రన్స్‌ ఛాలెంజ్‌లో పాల్గొని ధోనీనే గెలిచాడు. ఫిట్‌నెస్‌ కోసం ధోనీ తనకెంతో ఇష్టమైన ఎన్నో ఆహార పదార్థాలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. మహేంద్రసింగ్ ధోని చాక్లెట్లు, మిల్క్‌షేక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ, ఫిట్‌గా ఉండేందుకు వాటన్నింటినీ దూరం పెట్టినట్లు ధోనీ తెలిపాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుతూ.."తప్పనిసరిగా మారాలి. మెరుగైన ఫలితాలు సాధించాలనుకున్నప్పుడు కొన్ని మార్పులు అవసరం. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు నా ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకున్నాను. బట్టర్‌ చికెన్‌, నాన్‌, మిల్క్‌ షేక్స్‌, చాక్లెట్లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ తీసుకునేవాడిని. ఎప్పుడైతే నేను 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టానో అప్పటి నుంచి చాక్లెట్లు, మిల్క్‌షేక్స్‌ తీసుకోవడం మానేశాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సాఫ్ట్‌ డ్రింక్స్‌కు దూరమయ్యా. ఎప్పుడైతే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించానో అప్పటి నుంచి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలతో పాటు కబాబ్స్‌ తీసుకుంటున్నాను" అని ధోనీ ఫిట్‌నెస్‌ మంత్రం కోసం వ్యాఖ్యానించాడు.