సల్మాన్ కు హత్యకు కుట్ర..

SMTV Desk 2018-06-13 13:24:01  salman khan, murder mystery, police escart.

హైదరాబాద్, జూన్ 13 : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తానంటూ రాజస్ధానీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణొయి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వారు దైవంగా పూజించే కృష్ణ జింకను సల్మాన్‌ వేటాడటం దీనికి ముఖ్య కారణం. దీంతో సల్మాన్ కు ముంబై పోలీసులు కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సల్మాన్ నివాసం వద్ద సంపత్ రెక్కీ నిర్వహించాడని ముంబై పోలీసులకు హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమాచారం అందించింది. దీంతో సంపత్ నెహ్రాను హైదరాబాదులోని మియాపూర్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సంపత్‌ గ్యాంగ్‌లోని మరో ముగ్గురు షార్ప్‌ షూటర్స్‌ రాజు, అక్షయ్‌, అంకిత్‌ల ఆచూకిని మాత్రం పోలీసులు గుర్తించలేకపోయామన్నారు. వీరంతా ముంబై నగరంలో సల్మాన్‌ ఖాన్‌ను చంపడం కోసం తిరుగుతున్నట్లు, వీరికి సంబంధించి ఎటువంటి ఆధారాలు హర్యానా పోలీసుల వద్ద లేనట్లు సమాచారం. వీరి వల్ల సల్మాన్‌కు ప్రమాదం ఉన్నట్లు పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.