ప్రియాంక పెళ్లి ఇతనితోనేనా..??

SMTV Desk 2018-06-12 17:09:30  priyanka chopra, hollywood actor, nik jonas, priyanka marriage.

హైదరాబాద్, జూన్ 12 : బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంకా చోప్రా.. త్వరలో పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ప్రియాంక హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్ తో ప్రేమలో మునిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ఆజ్యం పోసినట్లు వీరిద్దరూ ఈ మధ్య చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారన్న వార్త వినిపిస్తోంది. ఈ మేరకు వీరిద్దరి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియాంక వివాహం నిక్‌తోనే అవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. 2017లో రెడ్‌ కార్పెట్‌పై ఇరువురూ జంటగా కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. తాజాగా నిక్ జోనాస్ ఫ్యామిలీ కి చెందిన ఒక ప్రైవేట్ వేడుకకు ప్రియాంక చోప్రా ప్రత్యేక అతిధిగా రావడమే కాక ఇద్దరూ చేతులు జోడించి కొత్త జంటలా పెళ్లికి హాజరయ్యారు. ఇదంతా ఒకవైపు అయితే నిక్ జోనాస్.. ప్రియాంక కంటే 11 ఏళ్ళు చిన్నవాడు కావడం గమనార్హం. మరి ఈ విషయంపై ప్రియాంక అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.