నాగార్జున కీలక నిర్ణయం..?

SMTV Desk 2017-07-12 16:28:37  Venkatesh, wanted, to, get, married, to, Nagarjuna, son, Akhil

హైదరాబాద్, జూలై 12 : నాగార్జున కుమారుడు అఖిల్, ఫ్యాషన్ డిజైనర్ శ్రేయ భూపాల్ ల నిశ్చితార్దం గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ మధ్య వస్తున్న వార్తల ప్రకారం కొన్ని పరిణామాల వలన వారి వివాహం ఆగిపొయిందని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం నాగచైతన్య వివాహం సమంతతో జరుగబోతుంది. ఆ తరువాత అఖిల్ వివాహం కూడా చేయాలని నాగార్జున చూస్తున్నారట. నాగార్జున వెంకటేష్ కూతురుతో అఖిల్ వివాహం చేయాలని చూస్తున్నట్లు సమాచారం. బావ బావమరది అయిన వీళ్ళు ఇప్పుడు వెంకటేష్ కూతురిని అఖిల్ కు ఇచ్చి ఈ బంధాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నారట. ఏదెమైన అసలు విషయం తెలియాలంటే ఇరు కుటుంబ సభ్యులు ఎవరైన ఒకరు అధికారికంగా చెప్పేవరకు చూడాల్సిందే.