శాటిలైట్ ఫోన్లు ఇక అంద‌రికీ..!

SMTV Desk 2017-05-29 14:57:57  satilite phone,bsnl satilite phone,work throw satilite

న్యూఢిల్లీ, మే 29: మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రభుత్వ రంగ సంస్థలు, విపత్తు నిర్వహణ సంస్థలు, పోలీసులకు మాత్రమే అందుబాటులో ఉండేలా ప్రారంభించిన శాటిలైట్ ఫోన్ సర్వీసులను మరో రెండేళ్లలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ శుభ‌వార్త‌ను చెప్పింది. శాటిలైట్ ఫోన్ సర్వీసుల కోసం ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌కు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేశామ‌ని, అయితే ఆ ప్ర‌క్రియ పూర్తి అయ్యేందుకు మ‌రో 18 నుంచి 24 నెల‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆ త‌రువాతే శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని అన్నారు. సిగ్న‌ల్‌ బెంగ ఉండ‌దు…శాటిలైట్ ఫోన్లు మొబైల్ ఫోన్ల‌లా కాదు. అవి ఎక్క‌డికి వెళ్లినా ప‌నిచేస్తాయి. సాధార‌ణంగా మొబైల్ ఫోన్లు ట‌వ‌ర్ల ద్వారా ప‌నిచేస్తాయి. అవి లేక‌పోతే సిగ్న‌ల్ అందదు. కానీ శాటిలైట్ ఫోన్లు అలా కాదు, నేరుగా శాటిలైట్‌కే అనుసంధానం అయి ఉంటాయి. క‌నుక సిగ్న‌ల్ స‌మ‌స్య ఉండ‌దు. ఎక్క‌డైనా, ఎప్పుడైనా వాటిని వాడ‌వ‌చ్చు.