మీడియాపై మిల్కీ బ్యూటీ ఆగ్రహం..

SMTV Desk 2018-06-10 14:39:16  milky beauty tamannaa, tamanna fire on media.

హైదరాబాద్, జూన్ 10 : మిల్కీ బ్యూటీ తమన్నా.. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు ఒకటి మాట్లాడితే మీడియా వాటిని వక్రీకరించి చుపించడంపై మండిపడుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. తన గురించి వార్తలు రాసేటప్పుడు తనని అడిగి కన్ఫార్మ్‌ చేసుకుని రాయండని సూచించింది. అంతేగాని టీఆర్పీ రేట్ల కోసం అసత్య వార్తలు రాయోద్దంటూ వేడుకొంది. ఈ మధ్యకాలంలో తన పెళ్లి గురించి గాసిప్స్ ఎక్కువయ్యాయని తెలిపింది. దయచేసి ఇలాంటి వార్తలు రాయవద్దని తాను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని వ్యాఖ్యానించింది. ఇలాంటి వార్తలు రాయడం వల్ల తాము బాధపడిపోతామని కూడా ఆలోచించరని మీడియాను కోరింది.