చమురు వినియోగదారులకు ఊరట..

SMTV Desk 2018-06-09 11:42:32  petrol prices decreases, oil companies, petrol prices, new delhi

ఢిల్లీ, జూన్ 9 : వాహన వినియోగదారులకు కొన్ని రోజులు చుక్కలు చూపెట్టిన చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కాగా వరుసగా 11వ రోజు కూడా తగ్గుదల నమోదైంది. అయితే గత పది రోజులతో పోలిస్తే నేడు అత్యధిక తగ్గింపు చోటుచేసుకుంది. శనివారం పెట్రోల్‌పై 40పైసలు, డీజిల్‌పై 30పైసలు తగ్గిస్తున్నట్లు ఆయిల్‌ కంపెనీలు వెల్లడించాయి. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. తాజా తగ్గింపుతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 77.02గా ఉంది. ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్ ధరల ప్రకారం.. ముంబయిలో రూ. 84.84, కోల్‌కతాలో రూ. 79.68, చెన్నైలో రూ. 79.95గా ఉంది. ఇక లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ. 68.28, ముంబయిలో రూ. 72.70, కోల్‌కతాలో రూ. 70.83, చెన్నైలో రూ. 72.08గా ఉంది. మొత్తంగా ఈ పదకొండు రోజుల కాలంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 1.41, డీజిల్‌ ధర రూ. 1.03 తగ్గింది.కర్ణాటక ఎన్నికల అనంతరం పెరుగుతూ పోయిన పెట్రో ధరలపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో గత పదిరోజుల్లో ఢిల్లీలో డీజిల్‌పై 82పైసలు తగ్గింది.