భేటి సజావుగా సాగితే కిమ్‌ ను పిలుస్తా..

SMTV Desk 2018-06-08 13:31:48  donald trup, kim jong un, america vs south korea, washinghton

వాషింగ్టన్‌, జూన్ 8 : ఉప్పు నిప్పులా ఉండే వ్యవహరించి ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్ భేటి తేది ఖరారైన విషయం తెలిసిందే. జూన్‌ 12వ తేదీన ఉదయం 9 గంటలకు(సింగపూర్‌ కాలమానం ప్రకారం) ట్రంప్‌, కిమ్‌ల సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశం సజావుగా సాగితే కిమ్‌ను అమెరికాకు ఆహ్వానిస్తామని ట్రంప్‌ వెల్లడించారు. కిమ్‌ జోంగ్‌ను వైట్‌హౌస్‌కు లేదా మార్‌-ఎ-లోగా రిసార్టుకు ఆహ్వానిస్తారా? అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా.. సింగపూర్‌ భేటీ సఫలమైతే కిమ్‌ను వైట్‌హౌస్‌కే ఆహ్వానిస్తానని వెల్లడించారు. సింగపూర్‌ సమావేశం కోసం ఎదురుచూస్తున్నా.. ఈ సమావేశంతో అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తున్నానని ట్రంప్‌ పేర్కొన్నారు. ఒకవేళ కిమ్‌తో సమావేశంలో ఏదైనా సమస్య వస్తే, తన అంచనాలు చేరుకోకపోతే సమావేశం నుంచి లేచి వెళ్లిపోతానని ఆయన గతంలో వెల్లడించారు. మరి ఈ ఇద్దరి మధ్య సమావేశం ఎలా జరుగుతుందోని యావత్ ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.