అమిత్ షా వస్తే నన్ను బంధించాలా..?

SMTV Desk 2018-06-06 16:32:10  amith shaa, ex.mp sanjay nirupam, house arrest.

ముంబై, జూన్ 6 : పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు భద్రత పేరిట తమ పార్టీ శ్రేణులను భయాందోళనకు నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజయ్‌ నిరుపమ్‌ మండిపడ్డారు. నేడు ముంబైలో అమిత్‌ షా పర్యటిస్తున్న సందర్భంగా తనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని వాపోయారు. ఈ రోజు మేము ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వలేదు. కాని పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు. అదేంటని పోలీసులను అడిగితే తనపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు చెప్పారని నిరుపమ్‌ మీడియాకు తెలిపారు. మేము అమిత్ షా పై నిరసన వ్యక్తం చేయడం.. లేదంటే ఆయన ఎదుట ఆందోళనలను చేస్తామని బీజేపీ భావించినట్టుంది. అ౦దుకోసమే నన్ను ఇంట్లోనే బంధించార౦టూ ఆగ్రహం వ్యక్తం చేశారు.