విరాట్... అనుష్క ఎక్కడ..?

SMTV Desk 2018-06-05 17:45:05  virat kohli tweet, anushka sharma, kohli tweet, bcci

ముంబై, జూన్ 5 : టీమిండియా క్రికెటర్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం తన సమయాన్ని కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ వెళ్లి కౌంటీ క్రికెట్‌ ఆడాలనుకున్న విరాట్ గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆడిన చివరి మ్యాచ్‌లో కోహ్లీ మెడకు గాయమైంది. బీసీసీఐ వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో వారి ఆధ్వర్యంలోనే కోహ్లీ శిక్షణ పొందుతున్నాడు. అయితే తాజాగా కోహ్లీ తన ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోలో కోహ్లీతో పాటు అతడి తల్లి, సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు. ఇందులో కోహ్లీ భార్య అనుష్క శర్మ లేదు. దీంతో అభిమానులు "కోహ్లీ..అనుష్క ఏది? ఎక్కడికి వెళ్లింది?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు "ఫొటో బాగుంది కానీ అనుష్క ఉంటే ఇంకా బాగుండేది; ఫొటోలో ఒకరు మిస్సయ్యారు; కోహ్లీ సోదరి కుమారుడు చూడ్డానికి కోహ్లీలానే ఉన్నాడు" అంటూ తెగ అంటూ కామెంట్లు పెడుతున్నారు.