వైసీపీ ఎంపీలకు భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలి : నారా లోకేష్

SMTV Desk 2018-06-05 13:41:50  nara lokesh tweet, nara lokesh about ycrcp, tdp vs ysrcp, amaravathi

అమరావతి, జూన్ 5 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, కేబినెట్‌ మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్ వేదికగా మరోసారి ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై మండిపడ్డారు. రాజీనామాల విషయంలో ఆ పార్టీ ఎంపీల నటన గొప్పదని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టి, భాజాపాతో కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడటంలో గొప్ప నటన కనబర్చారని విమర్శించారు. రాజీనామా నాటకంగాను ఆ పార్టీ ఎంపీలకు భాస్కర్ అవార్డ్స్ ఇవ్వాలని వ్యంగ్యంగా విమర్శించారు. వారు సొంత కథతో "ఏ1 మరియు అర డజన్ దొంగలు" సినిమా తీస్తే బాగుంటుందని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. " ఏమి నటన..! ప్రజలను పక్కదోవ పట్టించడానికి వైసీపీ పార్టీ ఎంపీలు చేస్తున్న నాటకానికి భాస్కర్ అవార్డ్స్ ఇవ్వచ్చు. భాజాపాతో కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడటంలో ఆ పార్టీ నేతలు మంచి నటనే ప్రదర్శిస్తున్నారు. వారు సొంత కథతో "ఏ1 మరియు అర డజన్ దొంగలు" సినిమా తీస్తే బాగుంటుంది" అని లోకేష్ వ్యాఖ్యానించారు.