అవును మా పెళ్లి అయిపోయింది..

SMTV Desk 2017-07-11 13:36:21  samantha, naaga chaithanya, twitter, marriage, social network site

ఫిలింనగర్, జూలై 11: అక్కినేని నాగచైతన్య, సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సామాజిక అనుసంధాన వేదికల ద్వారా తన అభిమానుల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది సమంత. సామ్ ట్విట్టర్ లోకి రాగానే అభిమానుల నుండి ఆమెకు పెళ్ళికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి సమంత చాల ఓపికగా సమాధానం చెబుతుంటుంది. కానీ ఇటీవల ఈ ప్రశ్నల తాకిడి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చైతూని పెళ్లి చేసుకోబోతున్నారు కదా? ఆ ఫీలింగ్‌ ఎలా ఉంది’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. "మా గురించి మాకు తప్ప మిగిలిన వాళ్ళకే ఎక్కువగా ఉత్సాహం ఉన్నట్టుంది. అయిన మా ఉహల్లో చైతూకి నాకు ఎప్పుడో పెళ్లయిపోయింది". అని సమాధానం చెప్పింది.