పారితోషికం విషయంలో అబ్బాయిలతో సమానంగా..

SMTV Desk 2018-06-04 14:44:57  pooja hegde, remuneration, girl indipendent.

హైదరాబాద్, జూన్ 4 : కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ ను బద్దలు కొడుతూ.. రికార్డులు సృష్టిస్తున్నాయి. హీరోలతో సమానంగా ఈ చిత్రాలు ఘన విజయాలను తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో రిలీజ్ అయిన "మహానటి", బాలీవుడ్ లో "రాజీ" చిత్రాలు ఘన విజయం సాధించడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ పూజా హెగ్డే.. ఇక అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అవి కూడా వసూళ్లు రాబడుతున్నాయి. అమ్మాయిలూ.. అబ్బాయిలు సంపాదిస్తున్నంత మీరూ సంపాదించడం మొదలుపెడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వారు ఇంకేం సాకు చెబుతారో?" అంటూ ఆలియా భట్‌, సోనమ్‌ కపూర్‌లను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. గతంలోనూ ఈ విషయంపై పోరాడిన వారిలో సోనమ్‌ కపూర్ ఒకరు. ఆమధ్య కాలంలో సోనమ్‌ పై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.