నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్...

SMTV Desk 2018-06-04 12:00:48  south west monsoon, south west monsoon in ap, ananthpuram, amaravathi

అమరావతి, జూలై 4 : నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను పలకరించాయి. సోమవారం అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు.. రెండ్రోజుల్లో రాయలసీమ, మహారాష్ట్ర ప్రాంతాలకు పూర్తిగా విస్తరిస్తాయని వెల్లడించింది. ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. క్యుములోనింబస్‌ మేఘాల వల్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. గత రెండ్రోజులుగా కోస్తాలో మినహా మిగిలిన చోట్ల ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గాయి. ఎక్కడా 40 డిగ్రీలు దాటలేదు.