వివాహ రోజు సందర్భంగా బోనీ భావోద్వేగ ట్వీట్..

SMTV Desk 2018-06-03 16:29:25  boneykapoor tweet, boney kapoor tweet about sridevi, bollywood, sri devi

ముంబై, జూన్ 3 : అతిలోక సుందరి గా పేరుగాంచి దేశవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానగణాన్ని సంపాదించుకొన్న తార శ్రీదేవి. దురదృష్టవశాత్తూ ఆమె గత ఫిబ్రవరిలో దుబాయ్‌లో బాత్ టబ్‌లో పడి మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి అభిమానులు.. సన్నిహితులు ఈ విషాదం నుంచి కొంత బయటపడగలిగినప్పటికీ... శ్రీదేవి కుటుంబ సభ్యులు మాత్రం ఆమె జ్ఞాపకాలను మరువలేకపోతున్నారు. శ్రీదేవి భర్త బోనీ ఆమె కుమార్తెలు ఖుషీ, జాన్వి మాత్రం ఆమెను తలచుకుంటూనే ఉన్నారు. శనివారం శ్రీదేవి, బోనీల వివాహ వార్షికోత్సవ సందర్భంగా బోనీ ఆమెను గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగ ట్వీట్ పెట్టారు. "నువ్వు ఉంటే ఇవాళ మన 22వ పెళ్లి రోజు అయి ఉండేది. జాన్.. మై వైఫ్.. భాగస్వామి, ప్రేమమూర్తి, అందం, ఆనందం ఎప్పటికీ నాలోనే ఉండు" అంటూ బోనీ ట్వీట్ చేశారు. త్వరలో బోనీ.... శ్రీదేవి గీసిన పెయింటింగ్స్ అన్నింటినీ సేకరించి ముంబైలో ఓ ఎగ్జిబిషన్ పెట్టనున్నారు.