వంటింటి సామానులో డ్రగ్స్ విక్రయం

SMTV Desk 2017-07-11 12:21:35  drugs supply, Excise officers, LDS and cocaine,Chili pepper, Onion,

హైదరాబాద్, జూలై 11 : నగరంలో రోజు రోజు డ్రగ్స్ స్మగ్లర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ పంపీణీ రవాణా వేరు వేరు మార్గాల్లో నడిపిస్తున్నారు. ఇటీవల మారేడుపల్లి వద్ద పట్టుబడిన అనిరుధ్‌ నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసిన 60 మందిని ఎక్సైజ్‌ అధికారులు ప్రశ్నించారు. వీరిలో అధిక శాతం మంది విద్యార్థులే. ఇంజనీరింగ్‌, ఏంబీఏలో సబ్జెక్ట్‌ (బ్యాక్‌లాగ్స్‌) మిగిలిన విద్యార్థులు.. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న యువకులే ఉన్నారు. వీరు తొలుత గంజాయికు అలవాటుపడి క్రమంగా ఎల్‌ఎ్‌సడీ, కొకైన్‌ తీసుకోవటం ప్రారంభించారని గుర్తించారు. స్నేహితు ల వల్లనే తమకు డ్రగ్స్‌ ఏజెంట్లు పరిచయమయ్యారంటూ చెప్పడం గమనార్హం. అయితే ఈ డ్రగ్స్ ను వంటింటికి సంబంధించిన సామానులో పంపీణీ ప్రారంభించారు. అవి మిరప కాయలే కానీ వాటి మధ్యలో అవే రంగులో అదే సైజులో కలిసిపోయిన కొన్ని డ్రగ్స్ ను దాచిన నకలీ మిపర కాయ, మరొకటి అవి అచ్చంగా ఉల్లిపాయలే కానీ వాటి పొట్టలో దాగినవి మాత్రం డ్రగ్స్ ఇలా రకరకాల మార్గాలను డ్రగ్స్ స్మగ్లర్లు అనుసరిస్తున్నారు. వీటికి ఎక్కువగా విద్యార్ధులే బానిసలవుతున్నారు. విషయంలోకి వెళితే ఇటీవల హైదరాబాద్ లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు సినీ పరిశ్రమలో కొందరికి, డ్రగ్స్‌ బానిసలైన వారికి విక్రయిస్తున్న కెల్విన్‌ గ్యాంగ్‌ అరెస్టు తర్వాత అన్ని మూలాలపై పోలీసులు దృష్టి సారించారు. కెల్విన్ గ్యాంగ్ స్టిక్కర్ల రూపంలో డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇతర గ్యాంగులు అనుసరిస్తున్న మార్గాలను విచారణ చేప్పట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. డ్రగ్స్ స్మగ్లింగ్ లో రోజుకో ఎత్తుగడ వేస్తూ ఉల్లిపాయలు, మిరపకాయలను వాడుకుంటున్నారు. కొన్ని ముఠాలు ఆర్టిఫీషియల్ మిరపకాయల్లో డ్రగ్స్ ప్యాకెట్లు పెట్టి వాటిని అసలు మిరప, ఎండుమిరప మధ్యలో ఉంచి రవాణా చేస్తున్నారు. మిరప ఘాటుకు పొలీస్ జాగిలాలు కూడా డ్రగ్స్ ను గుర్తించలేవన్నది ఆ ముఠాల ఎత్తుగడగా ఉన్నట్లు సమాచారం. మరికొన్ని ముఠాలు ఉల్లిపాయల్ని సగానికి కోసి కొంత భాగం ఖాళీ చేసి డ్రగ్స్ నింపుతున్నాయి. తరువాత ఎప్పటిలాగే చేరాల్సిన చోటుకు చేరవేస్తున్నాయి. గత ఏడాది శంషాబాద్ లో విమానాశ్రయంలో ఓ మహిళ పై సందేహం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. రహస్య అవయవాల్లో డ్రగ్స్ ప్యాకెట్లు ఉంచి తెస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు తనిఖీల్లో పట్టుబడుతున్న వారు ఎప్పుడో ఒకరిద్దరు ఉంటున్నా చిక్కని వారెందరో ఉంటున్నారని ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు.