జక్కన్న, ప్రిన్స్, చెర్రీకు తారక్ సవాల్..!

SMTV Desk 2018-06-01 12:49:25   #HumFitTohIndiaFit , #HumFitTohIndiaFit ntr, ntr challenge to ram charan, mohan lal

హైదరాబాద్‌, జూన్ 1: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ విసిరిన ఛాలెంజ్‌ను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ స్వీకరించారు. ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ చేసిన ఛాలెంజ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌..ఎన్టీఆర్‌‌కు సవాలు విసురుతూ ఇటీవల తన ఫిట్‌నెస్‌ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ సవాలును ఇప్పుడు తారక్‌ స్వీకరించారు. నా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం మోహన్‌లాల్‌ ఛాలెంజన్‌ను స్వీకరించానని సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తన ఫిట్‌నెస్‌ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో తారక్‌ లెగ్‌ కర్ల్స్‌(కాళ్లతో చేసే కసరత్తులు ) చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. "ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్‌ మోహన్‌లాల్‌ సర్‌. లాయిడ్‌ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో నా ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగంగా ఈ కసరత్తులు చేశాను. ఇప్పుడు నేను కల్యాణ్‌రామ్‌, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, రాజమౌళి, కొరటాలశివకు సవాలు విసురుతున్నాను. ఉపాసన..ఈ విషయాన్ని చరణ్‌కు చెప్పండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. తారక్‌ ట్యాగ్‌ చేసినవారందరికీ ట్విటర్‌ ఖాతాలు ఉన్నాయి. కానీ చరణ్‌కు లేదు కనుక ఎన్టీఆర్‌ ఆయన సతీమణి ఉపాసనకు ఖాతాకు చెర్రీను ట్యాగ్‌ చేశారు.