ఆ షోలో నేను పాల్గోనట్లేదు : తరుణ్

SMTV Desk 2018-05-31 19:13:13  tharun on big boss-2, nani host big boss-2, social media rumour big boss-2, hyderabad

హైదరాబాద్‌, మే 31 : నేచురల్‌ స్టార్ నాని వ్యాఖ్యాతగా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 2కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు నిర్వాహకులు. జూన్ 10 నుంచి షో ప్రారంభం కానునున్న విషయం తెలిసిందే. కాగా సామాజిక మాధ్యమాల్లో బిగ్‌బాస్-2 సీజన్‌లో పాల్గొనే సెలబ్రిటీలు వీరేనంటూ కొందరి పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. అందులో హీరో తరుణ్ పేరు కూడా ఉంది. అయితే ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను బిగ్‌బాస్‌ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. అసలు షోలో తనకు పార్టిసిపేట్‌ చేసే ఉద్దేశంగానీ, ఆసక్తి కానీ లేదని వెల్లడించారు. వంద రోజులు జరిగే ఈ సీజన్‌లో 16 మంది పార్టిసిపెంట్స్‌ అలరించబోతున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ నుండి శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. వైరల్ గా మారిన లిస్ట్ ఇదే...! సింగ‌ర్ గీతా మాధురి, యాంక‌ర్ శ్యామ‌ల, యాంక‌ర్ లాస్య‌, హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మి, ధ‌న్య బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ శ్రీదేవి, హీరోయిన్ గ‌జాలా, చాందిని చౌద‌రి, శ్రీరెడ్డి, వ‌రుణ్ సందేశ్, తనీష్, వైవా హ‌ర్ష, క‌మెడియ‌న్ వేణు, ఆర్యన్‌ రాజేష్