పతంజలి సిమ్ పథకాలు ఇవే..!

SMTV Desk 2018-05-31 12:35:25  patanjali sim plans, patnajali sim, baba ramdev, bsnl with patanjali

న్యూఢిల్లీ, మే 31: వినియోగ ఉత్పత్తుల రంగంలో ఆయుర్వేద, సహజ ఉత్పత్తులతో శరవేగంగా దూసుకుపోతున్న పతంజలి సంస్థ తాజాగా టెలికం రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్)తో చేతులు కలిపిన రాందేవ్ బాబా.. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే, తొలుత ఈ సిమ్ కార్డులు పతంజలి ఆఫీస్ బేరర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈ సిమ్‌ కార్డు పథకాలు వివరాలు .. >> పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.144 ప్లాన్‌. ఈ ప్లాన్‌ వాలిడిటీ నెల రోజులు. దీనిపై అపరిమిత వాయిస్‌ ఆల్‌ఇండియా రోమింగ్‌, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందనున్నారు. >> పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ ప్లాన్‌ ఓచర్‌- రూ.792. ఈ ప్లాన్‌ వాలిడిటీ 6 నెలలు. దీనిపై అపరిమిత వాయిస్‌ ఆల్‌ఇండియా రోమింగ్‌, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు. >> రూ.1584తో పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్‌ ప్లాన్‌ ఓచర్‌ -1584. ఈ ప్లాన్‌ వాలిడిటీ ఏడాది. దీనిపై అపరిమిత వాయిస్‌ ఆల్‌ఇండియా రోమింగ్‌, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు.